
Bollywood Balaraju Song Lyrics in English
Bollywood Balaraju Song Lyrics in Telugu
బాలీవుడ్ బాలరాజుని
పాటల్లో త్యాగరాజుని
బంగళాలో బంతులాడుకోనా
అచ్చంగా తెలుగు వాడిని
అందరిలో చిన్నవాడిని
గుండెల్లో గూడుకట్టుకోనా
చిరునవ్వుతో జీతే రహో ఈ జన్మకి
జీనా యహా గానా యహా ఏ నాటికి
అరెయ్ వాహ్ క్యా బాత్ హై
బాలీవుడ్ బాలరాజుని
పాటల్లో త్యాగరాజుని
బంగళాలో బంతులాడుకోనా
అచ్చంగా తెలుగు వాడిని
అందరిలో చిన్నవాడిని
గుండెల్లో గూడుకట్టుకోనా
సంగీతమవుతాను సై ఆటతో
వసంతాలు తెస్తాను లే నవ్వుతో
సూర్యుడ్ని దాస్తాను నా చూపులో
జనాలంతా రావాలి నా బాటలో
నిప్పులనే గుప్పిస్తా నీతి లేన్నపుడు
మల్లెలనే జల్లిస్తా మనసు వున్నపుడు
హెయ్ హెయ్ హెయ్
బాలీవుడ్ బాలరాజుని
పాటల్లో త్యాగరాజుని
బంగళాలో బంతులాడుకోనా
అచ్చంగా తెలుగు వాడిని
అందరిలో చిన్నవాడిని
గుండెల్లో గూడుకట్టుకోనా
మనసుంది పండేటి మాగాణిగా
వయస్సుంది లే నిత్య కళ్యాణిగా
పరువాల పాదాల పారాణిగా
వరించాను ఈ జన్మ నా రాణి గా
ఆ నింగి ఈ నేల హద్దులే రావులే
దానాలు ధర్మాలు అడ్డుకోలేవులే
హెయ్ హెయ్ హెయ్
బాలీవుడ్ బాలరాజుని
పాటల్లో త్యాగరాజుని
బంగళాలో బంతులాడుకోనా
అచ్చంగా తెలుగు వాడిని
అందరిలో చిన్నవాడిని
గుండెల్లో గూడుకట్టుకోనా
చిరునవ్వుతో జీతే రహో ఈ జన్మకి
జీనా యహా గానా యహా ఏ నాటికి
